తెలంగాణలో 500కి దిగువన రోజువారీ కరోనా కేసులు

  • గత 24 గంటల్లో 91,457 కరోనా పరీక్షలు
  • 494 పాజిటివ్ కేసులు నమోదు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 76 కేసులు
  • రాష్ట్రంలో నలుగురి మృతి
  • ఇంకా 9,405 మందికి చికిత్స
తెలంగాణలో కరోనా వ్యాప్తి మరింత తగ్గింది. గడచిన 24 గంటల్లో 91,457 కరోనా పరీక్షలు నిర్వహించగా, 494 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. గ్రేటర్ హైదరాబాదు పరిధిలో 76, కరీంనగర్ జిల్లాలో 49, వరంగల్ అర్బన్ జిల్లాలో 43, ఖమ్మం జిల్లాలో 40 కొత్త కేసులు నమోదయ్యాయి. నిర్మల్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 710 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,41,153 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,27,964 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 9,405 మందికి చికిత్స జరుగుతోంది. అటు, కరోనా మృతుల సంఖ్య 3,784కి పెరిగింది.

Telangana
Corona Virus
New Cases
Deaths
Update

More Telugu News